Monday, August 1, 2011

You are everything for me

Every second I am thinking about you.
Every minute I am running to reach you.
Every hour I am planning to get you.
Every day I am dreaming about you.
Every moment I am wishing to stay with you.

Tuesday, June 28, 2011

నా ఆలాపన


నీపై ఇష్టాన్ని దాచలేక నా మనస్సు పడే హృదయవేదన
దాన్ని నీకు చెప్పాలని, చెప్పలేక నా కళ్ళు పలికె ఆలాపన
ఆ ఆలాపనే నన్ను నిదురకు దూరంచేసి చేసింది నీ ఊహలా
నీ ఊహలకు చేరువై నాకు నేనే అయ్యాను ఓ జ్ఞాపకంలా
ఏనాటికి చల్లరెనో నీ లోకంలో జ్ఞాపకంలా నేను పడుతున్న సంగర్షణ ?

Tuesday, March 29, 2011

నా కవిత


నా కవితకు ప్రాణం చెరగని రూపం
రూపపు లావణ్యం నన్ను మైమరపించే కావ్యం
కావ్యపు బందం నా అణువణువునా విహరించే జీవనరాగం
జీవనరాగం నన్ను చేరుకునేనా ఆరకమునుపే దీపం ?

Tuesday, March 8, 2011

జన్మదిన శుభాకాంక్షలు


ఆ జాబిలమ్మ పరవసించి ఈ వెన్నెలమ్మను భువికి పంపిన రోజు
ఓ చిన్నికోయిల కూని రాగాలతో మహాలక్ష్మై అడుగిడిన రోజు
తన్మయత్వంతో ఇంటిల్లపాది ఆనందంలో ఓలలాడిన రోజు
ఈ నాట్యమయూరిని అభిమానించేవారు మరువలేని రోజు
అందుకోవమ్మ మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ నీ పుట్టిన రోజు

Sunday, November 7, 2010

నీ ఊహ

ఈ చిరుగాలిలో నీ గానం ఓ పిల్లనగ్రోవిలా నన్ను కట్టిపడేసింది

ఆ అరుణోదయంలో ఓ కాంతిపున్జంలా నీ అందం నన్ను బంధించింది

నీ ఊహ ఆ సంధ్యాకాలం సమీపించకముందే నన్ను త్వరపడమంది

నా మనస్సు నిన్ను గైకొని మరులుగోలుపు మరులోకానికి చేరుకోమంది

Saturday, June 5, 2010

ఆ పంచభూతాలు నా ప్రేమ సాక్షాలు


నీవు శ్వాసించి వీడిన గాలి నా హృదయాన్ని చేరి,
నీ తలపులతో నాకు ప్రతిక్షణం ఊపిరినిస్తుంది.

నా మదిలో మంచులా కోలుఉన్న నీ రూపు, నీపై
తాపంతో కరిగి అలజడితో అలలా ఎగసిపడుతుంది.

నీ జ్ఞాపకం నా లయలో బడబాగ్నిలా మండుతూ,
నిన్ను చేరుకోమని నన్ను ఎండమావిలా చేసింది.

నీతో నడిచిన ప్రతిచోటు నీ స్మ్రుతులనే తలపిస్తూ,
నువ్వు లేని నేను, నేను కానని నవ్వుతున్నాయి.

ఆకాశంకన్నామిన్నగా ఉన్న నా ప్రేమను మోయలేకున్న
నన్ను చూసి ఆ నింగి చినుకై నిన్ను చేరుకోమంది.

పంచభూతాలు సైతం నా ప్రేమకు పరవశించి నన్ను నీతో
కలపాలని ప్రయత్నిస్తున్న నీ మౌనం నన్ను ఆపేస్తుంది.

హృదయంలో నాపై ఇష్టం దాచి నీ మనస్సును నువ్వే
ఎందుకు వెలివేస్తున్నవో తెలియక నా మది నీ పిలుపుకై వేచిఉంది.


Thursday, May 6, 2010

ఓ భారతమాత బిడ్డ ఆవేదన...



ప్రపంచానికి నాగరికత నేర్పిన నా భారతమాత అవినీతి చేతిలో విల విలలాడుతుంది
అవునులే తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే అరాచక పాలకులు అమ్మనే అమ్మేస్తారు
అరచేతిలో త్రిశంకు స్వర్గం చూపిస్తూ, గాలిలో మేడలు కట్టేస్తూ అమ్మనే ఆరగిస్తున్నారు
కులగజ్జి లేపి పందికుక్కల్లా, గుంటనక్కల్లా అమ్మనే పంచుకుంటున్నారు, వీళ్ళ మన పాలకులు ?
ఈ రాక్షస పాలకులు మన భావిభారతవనికి బంక మన్ను మిగిల్చేలా వున్నారు.
ఈ అరాచకాన్ని ఆపి అవినీతిలేని అరుణోదయం చుపించేదుకు అభిమాన్యులం అవుదాం
అరాచక పాలకులు అవినీతిని తెగనరికి భారతమాతకు రక్త తర్పణ చేసి పునీతను చేద్దాం.