Wednesday, July 1, 2009

ఏమైందో ఏమో ఈవేళ


నీతో ఊసులాడువేళ ఈ ప్రపంచాన్ని మరచిపోతున్నా
నీవు పలకరించని నిమిషానా నాలో నేను కుమిలిపోతున్నా
నాకు ఏమైందో అన్నది తెలియక ప్రతి క్షణము సతమతమౌతున్నా
నాలోని ప్రేమను నీకు ఎలా తెలుపాలో తెలియక మౌనంగా రోదిస్తున్నా
నా మనస్సు పడే తపన నీవు తెలుసుకోవాలని క్షణ క్షణం తపిస్తున్నా
ఈ మధురయాతన తెలుసుకొని వస్తావని అనుక్షణం నీకై వేచిచూస్తున్నా

Monday, June 29, 2009

నా కంటి పాపా



నా కన్నీరే కరగకుండా దాగివుంది
నా కంటి పాపలో అయిన వున్నా నిన్ను విడవలేక
నా మాట ఎచ్చట దాగుందో తెలియకుంది
నీ చుట్టూ పాటల్లె తిరుగుతుందేమో మౌనంగా
నా ప్రేమ నీకు తెలుపలేని మది మౌనంగా వేచియుంది
కలనైన నిను విడిచే ఊహే నా మనస్సు తలవలేకా
కరుణ చూపి కదలి వస్తావో, హృదయంలో గాయంగా మారి కలచి వేస్తావో ఎదుటపడని నా దేవత ?

నీలోనే నే దాగివున్నా



ఆ బ్రమ్మ నిను నాకై పంపాడో లేదో తెలియదమ్మా
తీయ్యని మాటలతో నా మదిలో కొలువున్న ఓ అందాల బొమ్మ
నీవు నన్ను కాదన్నా, నీ ఊహ వీడలేనే కోయిలమ్మ
నీ నీడ నిను వీడే క్షణమున్నా, నేను నిన్ను వీడే క్షణం ఉండదమ్మ

Monday, June 22, 2009

నీకోసం నేను అని ఎలా తెలుపాలి ?


ఆకాశాన్ని సాగరం చేసి, నెలవంకను సబ్బుగా మార్చి
మేఘాలను నురుగుగా చేసి, చుక్కలను గులాబీ రేకులగా మర్చి
నీకు ఇస్తాను నీవు కోరిన వేళ
నా ఆశలను చిగురింప చేసి నీ ప్రేమ వెలుగులను దీపంగా మర్చి
మంచుల కరిగి చిరునవ్వుల మల్లెల మారి నా లయను నీ పానుపు చేసి
నిదురించవా ఓ నేస్తం

Saturday, June 20, 2009

నీకు ఎలా తెలపాలి నా ప్రేమ ?

నా మనసు నను వీడి నీ చెంత చేరిందే ఒక క్షణము
అది నువ్వు రుజువు చేయమన్న చాలేనా ఈ యుగము
నీ నీడల్లే విహరిస్తు నా వైపే రాను అంది ఏ క్షణము
నీ జ్ఞాపకాలే శ్వాసగా నీ పిలుపుకై వేచివుంది నా మౌనము

Friday, June 19, 2009

ప్రియుని మౌనరాగం

కావు నా ఊహ సుందరివి కాని మాయ చేసి దోచేశావు నా మదిని
రావు నా ముందుకు ఈనాటికి కాని అలజడులతో నిమ్పెస్తాను నా లయని
వీడవు ఎప్పుడు నా అడుగును కాని నీడల వెంటపడి దూరం చేస్తావు నాకు నిదురని
కలవు కావు నువ్వు ఏనాటికీ, విడిచి నేను బ్రతకటానికి నీ జ్ఞాపకాలని

Monday, April 13, 2009

నీవు లేని నేను లేను

క్షణమొక యుగంలా నే గడిపేస్తున్న

నీవు నా చెంతలేని ఈ క్షణాలన్ని !

ఎడారిలో ఎండమావిలా నే పయనిస్తున్నా

మదిలో దాచి నీపై ప్రేమ దాహాన్ని !

నిను మరువలేక మౌనంగా నే రోదిస్తున్నా

తలుచుకుంటూ విడలేని నీ జ్ఞాపకాలన్ని!

నీ పిలుపు కోసం కునుకన్నది లేక వేచిచూస్తున్నా

కరుణించి గెలిపించగా వస్తావని మన ప్రేమ పయనాన్ని ?