నా నీడవైతే నిన్ను విడిచి చీకటిలో బ్రతికెసేవాన్ని నా కలవైతే నిదురకు దూరంగా ఉండిపోయేవాన్ని నా ఊహవైతే బరువెక్కిన హృదయంతో వెలివెసేవాన్ని నా కన్నీరువైతే ఇంకిపోఎవరకు విలపించేవాన్ని నా ఊపిరే నువ్వైనప్పుడు ఎలా వదలను కడవరకు నీ నేస్తాన్ని?
నీవు నన్ను ద్వేషించినా, నేను నిన్ను ప్రేమిస్తూ ఉంటాను నీవు మౌనంగా ఉన్నా, దాని వెనుక అంతరంగానై నేనుంటాను నీవు నన్ను వీడిపోతున్నా నీ నీడల్లే నీతోనే ఉంటాను నీవు నన్ను మర్చిపోమన్నా, నువ్వు జ్ఞాపకం కాదు నా జీవితం అంటాను.