Saturday, November 15, 2008

మాత్రుముర్తికి అంకితం

కరుణ అను సంద్రం చిలికినప్పుడు ఉదయించిన కమ్మని కావ్యం అమ్మ
కల్మషం లేక తన కమ్మని ప్రేమని పంచుటకు ఇలలో వెలిసిన దైవం అమ్మ
పట్టుపురుగుల తానూ పోతూ కూడా నీకు మంచి చెయ్యాలనుకునేది అమ్మ
నీవు తన గుండెలపై తన్నినా ఓర్పుతో నీ ఆకలిని తీర్చి తన ఔదార్యాన్ని పంచేది అమ్మ
కఠినంగా ఆమె హృదయాన్ని గాయపరిచిన తన చల్లని దీవెనలు ఇచ్చేదే అమ్మ

Friday, November 14, 2008

అర్ధం కాని అమ్మాయి మనస్సు

సాగర కెరటాలతో తేలియాడు తామరాకుపై నీటి తుంపర తరుణీ మనస్సు
కలువరేకులా తన తీయ్యని పరిమళాలతో ఆకర్షించెను ఆమె సొగస్సు
నడి సంద్రంలో గమ్యం తెలియని నావల అవగాహనా కాదు ఆమె అంతరంగాల సరస్సు
ఆమె మనోభావాల ఆశల అలలతో ఎదురు ఈదాలన్న తిరిగిరాదు నీ వయస్సు

Thursday, November 13, 2008

ప్రేమ తో విధి ఆడిన ఆట

నా కొరకై దివిని వీడి ధరణికి చినుకులా వచ్చావు
నా జీవితం లో రంగుల హరివిలై పువ్వులు పూయించావు
విధి అనే వింత నాటకం తో ఆకుల రాలిపోయవు
నీవు మట్టిలో కలిసి నన్ను మోడుగా మార్చావు

జన్మదిన శుభాకాంక్షలు

పసి పాపాయి మోము పసిడి కాంతుల నవ్వూ
మంచితనపు మారు పేరు కొత్తదనం కొసరు పేరు
పదహారణాల మన లావన్యనికి మరపు రాని రోజు
తెలియజెయ్యాలి తనకు శుభాకాంక్షలు మరోమారు

గెలుపు కొరకు బాటసారి

ఇన్ని నాళ్ళ పయనమింక ఆగిపోయే దేనివలనో
కోరుకున్న తిరమింక చేరలేక పోతున్నావా
గమ్యమింక చేరలేని బాటసారి అయ్యినవా
తప్పు నువ్వు తెలుసుకొని తీరమింక చేరుకోరా
గెలుపు కొరకు పరుగుతేసి విజయ లక్ష్మి చెంతచేరు