Friday, February 20, 2009

ఆడకు అట అమ్మాయితో

ఘోరకలి ఈ ఆకలి మన జన్మ కారకుల పైన రాచ లీల కేళి
స్త్రీ ఆది పరశక్తై ప్రజ్వలిల్లాలి దుర్మదాందుల మదిలో భీతి కలిగించాలి
పురుషజాతి అహంకారాన్ని విడనాడాలి ఆదరించి వారిని ఆప్యాయంగా ఆదరిచాలి
ప్రేమిస్తే ఆడది అయ్యెను నీ బలిమి ద్వేషిస్తే అయ్యెను నీ పాలిట భద్రకాళి

3 comments:

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

ఎందుకండీ బాబూ ! మగవాళ్ళ మీద మీకింత కోపం, మీరు స్వయంగా మగవాళ్ళయి ఉండీ ? ఏం ? ఏ మగవాడూ మీ జన్మకి కారకుడు కాదా ? మీరు కేవలం ఆడదానికే పుట్టారా ? ఏమో నేను మాత్రం ఒక మగవాడికీ ఒక ఆడదానికీ ఇద్దఱికీ పుట్టాను. ఫెమినిస్టులమని పేరు పెట్టుకొన్న కొందఱు ఆడవాళ్ళు మగవాళ్ళందరి మీదా ఎన్నో దశాబ్దాల నుంచి పనిగట్టుకొని దుష్ ప్రచారం చెయ్యడం మాత్రం బావుందా ? జన్మ నిచ్చిన మగవాడి మీద అలా ప్రచారం చెయ్యొచ్చునా ? ఆడది ఆడది నవమాసాలు మోసి పిల్లల్ని కంటుందంటారు. కాని ఆ తరువాత ఆ పిల్లల్ని జీవితాంతం మగవాడే మోస్తాడు. ఆ రెండో ముక్క సంగతి మాత్రం ఎవడూ మాట్లాడదు. కానీ మగవాడి కష్టార్జితంలో అతనికి సంబంధించిన ప్రతి ఆడదానికీ వాటా కావాలి. ఆడదాని మీద అతిజాలి. మగవాడి మీద అవసరానికి మించిన క్రూరత్వం. ఇదయ్యా ఈ సంఘనీతి !

మనం ఆడవాళ్ళ హక్కుల కోసం ఉద్యమించే పరిస్థితి లేదు. ఈ కాలంలో మన హక్కుల్ని మనం కాపాడుకోగలిగితే అది చాలా గొప్ప విషయం. వాళ్ళ పరిస్థితి మనకంటే చాలా మెఱుగ్గా ఉంది. వాళ్ళకందఱూ మద్దతే. మనకెవడూ లేడు, మనం తప్ప . ఇకనైనా మగవాళ్ళకు అనుకూలంగా ఏమైనా రాయండి. తోటి మగవాడుగా సంతోషిస్తాను. Don't devalue man. Man is always dignified than woman in every way. మగవాణ్ణి మీద దాడి, వ్యవస్థ మీదే దాడి కింద లెక్క. అది అరాచకానికి దారితీస్తుంది. జాగ్రత్త !!

కనకాజీ said...
This comment has been removed by the author.
కనకాజీ said...

హలో ఈ కవిత ఎవరైతే అమ్మాయిలపై స్వతహాగా ప్రేమ లేకుండా కామంతో అటలు ఆడలనుకుంటారో వారి కొరకు రాసాను. అంతే కాని అబ్బాయిలను తక్కువ చేద్దాం అని అస్సలు కాదు. మగవారికే అన్యాయం జరుగుతుంది సమాజం లో అని నాకు తెలుసు. మంచి వారికి ఇది వర్తించదు ............