రెండు హృదయాల ఆకర్షణతో తొలకరి జల్లులా మొగ్గతోడిగెను ఈ ప్రేమ
తలపులకు అతి మధురంగా వుండే ఈ ప్రేమ సాదించుటకు అన్ని అగచట్లే !
ఏముందో ఏమో తెలియదు కాని మాన్పలేని తీయ్యని గాయం లాంటిది ప్రేమ
విహరించే ప్రేమ పక్షులకు నిదురలేని రాత్రులెన్నో , నిలబడనియ్యని పయనలింకెన్నో!
కడదాకా సాగేనా లేక కనుమరుగై పోయేనా ఈ అలుపెరుగక ఎగసిపడే ప్రేమ కెరటాలు?
1 comment:
మీ కవిత బావుందండీ .ఆర్పలేని అనేచోట మాన్పలేని అని ఉంటే బావుండేదనిపించింది .అన్యధా భావించకండీ ....
Post a Comment