సాగర తీరాన నీకై ఎగసిన ఆశల వెల్లువ నేను
ఊహలో జగితిలో నీకై పరిభ్రమించే పాటల పల్లవి నేను
మరువలేని ఈ మనోరమకై విరిసిన వెన్నెల వెలుగును నేను
యద కోవెల్లో కొలువుండు నీకై హరతిల కరిగే కర్పూరం నేను
గులాబీ లాంటి నిన్ను కాపాడగా అవతరించిన ముల్లును నేను
నీ లేత అదరాలను ముద్దడగా వచ్చే చిరుగాలిని నేను
నీకై పరుగులు తీసే నా మదిని ఇక ఎలా ఆపగలను నేను
1 comment:
చాలా బాగున్నాయి మీ కవితలు..
ఆలశ్యంగా చూసాను... మిస్సైయ్యాను.
Post a Comment