Sunday, November 7, 2010

నీ ఊహ

ఈ చిరుగాలిలో నీ గానం ఓ పిల్లనగ్రోవిలా నన్ను కట్టిపడేసింది

ఆ అరుణోదయంలో ఓ కాంతిపున్జంలా నీ అందం నన్ను బంధించింది

నీ ఊహ ఆ సంధ్యాకాలం సమీపించకముందే నన్ను త్వరపడమంది

నా మనస్సు నిన్ను గైకొని మరులుగోలుపు మరులోకానికి చేరుకోమంది

Saturday, June 5, 2010

ఆ పంచభూతాలు నా ప్రేమ సాక్షాలు


నీవు శ్వాసించి వీడిన గాలి నా హృదయాన్ని చేరి,
నీ తలపులతో నాకు ప్రతిక్షణం ఊపిరినిస్తుంది.

నా మదిలో మంచులా కోలుఉన్న నీ రూపు, నీపై
తాపంతో కరిగి అలజడితో అలలా ఎగసిపడుతుంది.

నీ జ్ఞాపకం నా లయలో బడబాగ్నిలా మండుతూ,
నిన్ను చేరుకోమని నన్ను ఎండమావిలా చేసింది.

నీతో నడిచిన ప్రతిచోటు నీ స్మ్రుతులనే తలపిస్తూ,
నువ్వు లేని నేను, నేను కానని నవ్వుతున్నాయి.

ఆకాశంకన్నామిన్నగా ఉన్న నా ప్రేమను మోయలేకున్న
నన్ను చూసి ఆ నింగి చినుకై నిన్ను చేరుకోమంది.

పంచభూతాలు సైతం నా ప్రేమకు పరవశించి నన్ను నీతో
కలపాలని ప్రయత్నిస్తున్న నీ మౌనం నన్ను ఆపేస్తుంది.

హృదయంలో నాపై ఇష్టం దాచి నీ మనస్సును నువ్వే
ఎందుకు వెలివేస్తున్నవో తెలియక నా మది నీ పిలుపుకై వేచిఉంది.


Thursday, May 6, 2010

ఓ భారతమాత బిడ్డ ఆవేదన...



ప్రపంచానికి నాగరికత నేర్పిన నా భారతమాత అవినీతి చేతిలో విల విలలాడుతుంది
అవునులే తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే అరాచక పాలకులు అమ్మనే అమ్మేస్తారు
అరచేతిలో త్రిశంకు స్వర్గం చూపిస్తూ, గాలిలో మేడలు కట్టేస్తూ అమ్మనే ఆరగిస్తున్నారు
కులగజ్జి లేపి పందికుక్కల్లా, గుంటనక్కల్లా అమ్మనే పంచుకుంటున్నారు, వీళ్ళ మన పాలకులు ?
ఈ రాక్షస పాలకులు మన భావిభారతవనికి బంక మన్ను మిగిల్చేలా వున్నారు.
ఈ అరాచకాన్ని ఆపి అవినీతిలేని అరుణోదయం చుపించేదుకు అభిమాన్యులం అవుదాం
అరాచక పాలకులు అవినీతిని తెగనరికి భారతమాతకు రక్త తర్పణ చేసి పునీతను చేద్దాం.

Sunday, May 2, 2010

ఆలాపన

నీ కంటి చూపుల వెలుగులతో చీకటి అనేది లేకుండా చేశావు
నీ నవ్వుల గలగలలతో నాకు నిదురని దూరం చేశావు
మౌనంగా ఉండే నా పెదవులను అనుక్షణం నీ పేరే తపించేల చేశావు
హృదయం పగిలేల సవ్వడి చేస్తూ ఊహల్లో నాట్యం చేస్తున్నావు
నీవు లేకుండా నా జీవితం ఇక సాగదేమో అనుకునేల చేస్తున్నావు
నీవు నాకు లేవు అని తెలిస్తే ఇక నేను లేనేమో అనుకుంటున్నాను

Friday, March 26, 2010

ఏమి మాయ చేసావే నువ్వు ?




కనులు మూసి నిదురిస్తుంటే కలలో నీ జ్ఞాపకాలు
కనులు తెరిచి చూస్తే కనుల ఎదుట నీ తలపులు

పదములు ఎన్నున్నా అనుక్షణం నే పలికే పదం నీ పేరు
వర్ణములు ఎన్నున్నా క్షణ క్షణం నాకు కనిపించేది నీ రూపము

ఒంటరిగా వెళుతున్నా నాతొనే ఉన్నావు అనుకుంటున్నా నువ్వు
ఎందరితో కలిసి ఉన్న నా తలపులలో విహరిస్తున్నావు నువ్వు

చెంతలేకున్నా నా కన్నులు ప్రతిక్షణం ఎదురుచుసేను నీకై
ఏమి అయిపోతనో తెలియకున్నా వేచి ఉన్నాను నీ పిలుపుకై