నీ మాటలతో నాపై వెన్నెల వెదజల్లుతావు.
ఆ నెలవంకలా నాకు ఎప్పటికి అందనంటావు.
నీ చూపులతో కలువ పువ్వులా నన్ను ఆకర్షిస్తావు.
ఆ నీళ్ళల్లో దూరంగా ఉంటూ నా దరికి చేరనంటావు.
నీ ఊహలతో నాలో తీయ్యని గాయాలు రేపి ఆనందిస్తావు.
ఆ గాయాల జ్ఞాపకాలతో నాకు నిదురను దూరం చేస్తావు.
నీ అభిమానంతో నన్ను నీ చుట్టు తిరిగే నీడలా మార్చేస్తావు.
ఆ చీకటిలో ఉంటూ నీ నీడగా ఉన్న నన్ను వెలివేస్తున్నావు.
4 comments:
Nice one...
!! కనకాజీ !! గారు చాల బాగా వ్రాశారు
super....
నీ చూపులతో కలువ పువ్వులా నన్ను ఆకర్షిస్తావు.
ఆ నీళ్ళల్లో దూరంగా ఉంటూ నా దరికి చేరనంటావు.
చాలా బాగుంది! చక్కని భావన!
Post a Comment