నాతో నేనే నాలో నేనే నాకై నేనే నా అంతఃరాత్మతో జరుపుతున్నాను యుద్ధం
అయినవారికి అండగా ఉండి రానివ్వకూడదనుకున్నాను ఏ కష్టం
విధి ఆటకు బానిసలై నమ్ముకున్న నా వాళ్లె మిగిల్చారు నాకు విషాదం
ఆలస్యంగా తెలిసెను, స్వార్దచింతనలేని లోకానికి ఆత్మీయత అన్నది పెద్ద అబద్దం
అందరికై జీవించిన నేను, నాకై జీవించక అయ్యాను నాకే ఓ జ్ఞాపకం
నాలో లేని నాకు రేపన్నది వ్యర్దం, బ్రతుకన్నది తీరని శోకం
గెలిచానో ఓడానో తెలియదు కాని అయిపోయింది నా అంతఃరాత్మ అంతః !
2 comments:
Superb..
Superb sir
Never give up
Post a Comment