కరుణ అను సంద్రం చిలికినప్పుడు ఉదయించిన కమ్మని కావ్యం అమ్మ
కల్మషం లేక తన కమ్మని ప్రేమని పంచుటకు ఇలలో వెలిసిన దైవం అమ్మ
పట్టుపురుగుల తానూ పోతూ కూడా నీకు మంచి చెయ్యాలనుకునేది అమ్మ
నీవు తన గుండెలపై తన్నినా ఓర్పుతో నీ ఆకలిని తీర్చి తన ఔదార్యాన్ని పంచేది అమ్మ
కఠినంగా ఆమె హృదయాన్ని గాయపరిచిన తన చల్లని దీవెనలు ఇచ్చేదే అమ్మ
2 comments:
చిట్టినేని కనకాజి గారు,బాగుంది మీ కవిత,మీరు ఇన్ని కవితలు రాసినట్లు ఇప్పుడే చూడ్డం,
మీరు తెలుగులో టైప్ చేసేందుకు ఏ పరికరాలు వాడుతున్నారో నాకు తెలీదు గాని,బరహ వాడండి.అలాగే ఇంత కష్టపడి కవితలు రాసినాక ప్రచురించేముందు ఒకసారి అచ్చు తప్పులు సరి చూసుకుంటే మీరు చెప్పాలనుకున్నది సూటిగా మాకు చేరుతుంది.
కరుణ అను సంద్రం చిలికినప్పుడు ఉదయించిన కమ్మని కావ్యం అమ్మ
కల్ముషం/కల్మషం లేక తన కమ్మని ప్రేమని పంచుటకు ఇలలో వెలిసిన దైవం అమ్మ
పట్టుపురుగుల తానూ పోతు/పోతూ కూడా నీకు మంచి చెయ్యాలనుకునేది అమ్మ
నీవు తన గుండెలపై తన్నిన/తన్నినా ఓర్పుతో నీ ఆకలిని తీర్చి తన ఔదార్యన్ని/ఔదార్యాన్ని పంచేది అమ్మ
కటినంగా/కఠినంగా ఆమె హృదయాన్ని గాయపరిచిన/గాయపరచినా తన చల్లని దీవెనలు ఇచ్చేదే అమ్మ
మీరు మరిన్ని సూచనల కోసం తెలుగుబ్లాగు గుంపును సంప్రదించవచ్చు,అక్కడ పెద్దలు మీకు సహకరించగలరు,అలాగే కింద వర్డ్ వెరిఫికేషన్ తీసెయ్యండి.
చాలా బాగుంది
Post a Comment