నన్ను విడిచి వెళ్ళిన నా ప్రాణం
నాతొ మాటలాడనన్నదా నీ మౌనం
నీకై విలపించి నా కన్నులాయెను సాగరం
ఆ కన్నీటి కెరటాలా రాగంలోనూ నీ నామం
నన్ను చేసివేశావు ఓ శల్యం
నువ్వు రాక నిదురలేవనంటోంది నా నయనం
నీ ఊహలాయెను ఓ జ్ఞాపకం
ఆ జ్ఞాపకాలే నాలో నీకై రగిలే తీయ్యని గాయం
నువ్వు లేవు అన్నాక నే శూన్యం
నాపై కరుణన్నదె లేదా ఓ ఆశా దీపం
నే చూశాను శూన్యంలో నీ రూపం
ఆ రూపంలో కనిపిస్తుంది నా జీవిత గమనం