Sunday, March 11, 2012

కంటి పాప


కన్ను మూసిన తెరచిన కంటి పాపను వీడలేము

నా కంటి పాపా దూరమై నా కన్నీరాయెను మున్నేరు

ఆ మున్నేరులో మునకలేస్తూ దూరమయ్యాను నా లక్ష్యాలను

లక్ష్యం మరచిన ఎదురీదాలి చేరేందుకు నా కలవైన నిన్ను

Sunday, March 4, 2012

ఎదురీత...



నీ తీయ్యని మాటలతో నాలో రేపావు మునుపెన్నడూ కలగని ఆశల్ని

ఆ ఆశల్ని నీ హర్ష వర్షంతో చిగురిమ్పచేసి చేశావు నన్ను నీ స్వప్నాన్ని

ఇంతలోనే, ఆ స్వప్న లోకంలో విహరించే నా ఊహల్ని చేశావు ఎడారిలో ఎండమావుల్ని

ఆ యడబాటుతో తల్లడిల్లుతున్న నాలో రేపుతూనే ఉన్నావు మానని గాయాల్ని

ఈ గాయాల బాధను తాళలేక నిన్ను చేరలేక చెమర్చాయి నా కళ్ళన్నీ

చెమర్చిన కళ్ళతో, తీరాన్ని చూపని నీకై ఎదురీదుతూనే ఉన్నాను దుఖసాగారాన్ని.

Wednesday, February 15, 2012

నీ కంటి పాపలో నేను



ప్రపంచాన్ని మరచి నీ కళ్ళల్లోకి చూస్తూ
నన్ను తాకే నీ వెచ్చని శ్వాసను ఆస్వాదిస్తూ
నీ కరములను నా కరములచే గట్టిగ హత్తుకొని నువ్వు
నీ ప్రేమ నాకు మాత్రమే సొంతం అనుకుంటూ
భీతన్నది లేక నీ కనురెప్పమాటున నిదురించాలనుకున్నాను

దైవం ఈర్షతో విధి అనే ఆట ఆడుతూ
మట్టిబొమ్మలం అని మనస్సులు విరిచేస్తూ
నిన్ను నా నుండి వేరుచెయ్యాలని ఆకాంక్షిస్తుంటే
బీరువల్లే పారిపోక ఒక్క క్షణం ఆగమని
నీ వియోగము కలిగించక మునుపే నా ఊపిరి గైకొనమంటాను

Saturday, February 4, 2012

నా ఊపిరి



నా నీడవైతే నిన్ను విడిచి చీకటిలో బ్రతికెసేవాన్ని
నా కలవైతే నిదురకు దూరంగా ఉండిపోయేవాన్ని
నా ఊహవైతే బరువెక్కిన హృదయంతో వెలివెసేవాన్ని
నా కన్నీరువైతే ఇంకిపోఎవరకు విలపించేవాన్ని
నా ఊపిరే నువ్వైనప్పుడు ఎలా వదలను కడవరకు నీ నేస్తాన్ని?

నువ్వు నేను


కరగని మనస్సు నీది, దాని జ్ఞాపకాలు దాచిన హృదయం నాది.
కవులకు అందని లాస్యం నీది, ఆ మైకంలో మునిగిఉన్న మనస్సు నాది.

ఎగసిపడే కెరటం లాంటి ఊహలు నీవి, ఆ కడలిన దాగిన బడబాగ్ని మోసేది నేను.
నివురుగప్పిన నిప్పువి నీవు, దహిస్తావు అని తెలిసినా, నిన్ను వీడలేని తత్త్వం నేను.

Sunday, January 29, 2012

జ్ఞాపకం కాదు జీవితం


నీవు నన్ను ద్వేషించినా, నేను నిన్ను ప్రేమిస్తూ ఉంటాను
నీవు మౌనంగా ఉన్నా, దాని వెనుక అంతరంగానై నేనుంటాను
నీవు నన్ను వీడిపోతున్నా నీ నీడల్లే నీతోనే ఉంటాను
నీవు నన్ను మర్చిపోమన్నా, నువ్వు జ్ఞాపకం కాదు నా జీవితం అంటాను.

Saturday, December 31, 2011

నా కల


కన్నులకు కలలు సహజం.
ఆ కలలు ఏవేవో ఊహల ఫలితం.

కలలు నిజమైతే కనడం ఓ అర్దం.
కలలు కల్లలైతే కనడం ఎంతో కష్టం.

నా కన్నులు కంటిపాపైన నీకు అర్పితం.
అందులో కన్నీరు మాత్రం నాకు సొంతం.

ఎందరిలో నేనున్నా, నా ఊహలు నీకు అంకితం.
నీ జ్ఞాపకాలతోనే చివరకు అయిపోతానేమో అంతం.